Charminar: చార్మినార్ దగ్గర డ్రోన్ కలకలం... పోలీసుల అదుపులో బెంగాలీ యువతి!

  • చార్మినార్ వద్ద ఎగిరిన డ్రోన్
  • చార్మినార్ వద్ద డ్రోన్లపై నిషేధం
  • తనకు విషయం తెలియదన్న బెంగాలీ యువతి
  • విచారిస్తున్న పోలీసులు

తెలంగాణలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన పాతబస్తీలోని చారిత్రాత్మక చార్మినార్ కట్టడం వద్ద ఓ డ్రోన్ కలకలం రేపింది. చార్మినార్ పైన ఓ డ్రోన్ తిరుగుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చిన పోలీసులు ఓ బెంగాలీ యువతిని అదుపులోకి తీసుకున్నారు.

చార్మినార్ వద్ద డ్రోన్ లపై నిషేధం ఉందని పోలీసులు వెల్లడించగా, ఆ విషయం తనకు తెలియదని, తాను సరదాగా ఈ పని చేశానని సదరు యువతి వాపోయింది. ఆమె హైదరాబాద్ ఎందుకు వచ్చింది? డ్రోన్ లను ఇంకా ఎక్కడెక్కడ ఎగురవేసింది? ఏఏ ప్రాంతాలను వీడియో తీసింది? అన్న వివరాలను పోలీసులు విచారిస్తున్నారు. అనుమతి లేకున్నా చార్మినార్ వద్ద డ్రోన్ ఎగురవేసినందుకు ఆమెపై కేసు రిజిస్టర్ చేశారు.

Charminar
Drone
Hyderabad
Police
Arrest
  • Loading...

More Telugu News