Hyderabad: హైదరాబాద్, కృష్ణానగర్ లో భారీ అగ్ని ప్రమాదం

  • నాలుగంతస్తుల భవంతిలో మంటలు
  • షార్ట్ సర్క్యూట్ కారణంగానే
  • అదుపు చేసిన ఆరు ఫైరింజన్లు

వర్థమాన సినీ తారలు, జూనియర్ ఆర్టిస్టులు అధికంగా నివాసం ఉండే హైదరాబాద్ లోని కృష్ణా నగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆడిటోరియం పక్కనే ఉన్న నాలుగంతస్తుల భవంతిలో మంటలు చెలరేగాయి. వసంత హార్డ్ వేర్ అండ్ పెయింట్స్ దుకాణంలో మంటలు వ్యాపించగా, విషయం తెలుసుకున్న అధికారులు ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు చాలాసేపు శ్రమించారు.

స్టోర్ లో రంగులు, రసాయనాలు అధికంగా ఉండటంతో మంటలు అంత తొందరగా అదుపులోకి రాలేదు. భవంతిలోని వారందరినీ ఖాళీ చేయించిన అధికారులు, క్రేన్ సాయంతో గోడలను పగులగొట్టి, కరెంట్ సరఫరా నిలిపివేయించి, లోపలికి నీరు చిమ్మారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కూడా ఖాళీ చేయించారు. ఈ ఘటనలో సుమారు రూ. 25 లక్షల మేరకు ఆస్తి నష్టం కలిగివుండవచ్చని స్టోర్ యాజమాన్యం అంచనా వేసింది. కరెంట్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

Hyderabad
Fire Accident
Krishna Nagar
  • Loading...

More Telugu News