Hyderabad: ఒకరితో సహజీవనం చేస్తూ.. మరొకరిని పెళ్లాడిన ప్రబుద్ధుడికి అరదండాలు

  • నాలుగేళ్ల సహజీవనం తర్వాత మరో యువతితో వివాహం
  • పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు
  • అరెస్ట్ చేసిన పోలీసులు

‌నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టమన్నాడు. పెళ్లాడతానని ప్రమాణం చేశాడు. నాలుగేళ్లపాటు సహజీవనం చేశాడు. తర్వాత ఎంచక్కా మరో యువతిని పెళ్లాడాడు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో జరిగిందీ ఘటన. బాధిత యువతి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడికి అరదండాలు వేశారు.
 
పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్‌ సైదప్ప బస్తీలో నివసించే యువతి(23)కి స్థానికంగా ఉండే సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమకు దారి తీసింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, తాజాగా, సత్యనారాయణ మరో యువతిని పెళ్లాడాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Hyderabad
Film Nagar
Love
Police
Arrest
  • Loading...

More Telugu News