Chandrababu: ఇదో మహత్తర ఘట్టం.. ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరిగిందా?: చంద్రబాబు

  • ఒకే రోజు మూడు లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు
  • చరిత్రలో ఇదే తొలిసారి
  • గుంటూరు జిల్లా నేతలతో చంద్రబాబు

ఒకే రోజు మూడు లక్షల గృహ ప్రవేశాలు ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో గురువారం రాత్రి జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఒకే రోజు లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు జరగడం మహత్తర ఘట్టమన్నారు. చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదని, మీరెప్పుడైనా చూశారా? అని నేతలను ప్రశ్నించారు. ఒకప్పుడు సిమెంటు రోడ్డు వేయడాన్నే గొప్పగా భా‌వించేవారని, అలాంటిది టీడీపీ ప్రభుత్వం 23 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్డు వేసినట్టు చెప్పారు. అలాగే, వేలాది అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు నిర్మించామన్నారు. హిజ్రాలకు, తలసేమియా, కిడ్నీ రోగులకు కూడా పింఛన్లు ఇస్తున్నట్టు వివరించారు.

తనకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలూ సమానమేనన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన శ్రమను ప్రజలు గుర్తిస్తారని, పుష్కలంగా ఓట్లు పడతాయన్న నమ్మకం తనకు ఉందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. తాను కార్యకర్తల మనిషనని, వారికి అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

Chandrababu
Guntur District
Telugudesam
Leaders
  • Loading...

More Telugu News