Viral Videos: ఇంగ్లండ్‌లో 'టీమిండియా' బస్సులో.. కోహ్లీ భార్య అనుష్క శర్మ.. వీడియో

  • కార్డిఫ్‌లోని సోఫియాలో రేపు రెండో టీ20
  • రేపు రాత్రి 10 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం 
  • బస్సులో హోటల్‌ చేరుకున్న టీమిండియా 
  • కోహ్లీ వెంటే అనుష్క శర్మ

ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా, టీమిండియా ఆటగాళ్లు రెండో టీ20 కోసం ఓ బస్సులో ఇంగ్లండ్‌లోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. అదే బస్సులో ప్రయాణించిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

బస్సులోంచి మొదట అనుష్కశర్మ దిగగా, ఆ వెంటనే కోహ్లీ దిగాడు. కొన్ని రోజుల ముందు విరాట్‌ కోహ్లీ ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరే ముందు ఆమె ముంబయి ఎయిర్‌పోర్టుకి వచ్చి ఆయనకు వీడ్కోలు పలికింది. ఇప్పుడు ఆమె ఒక్కసారిగా కోహ్లీతో కనపడింది. కార్డిఫ్‌లోని సోఫియా మైదానంలో భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Viral Videos
Instagram
Virat Kohli
Anushka Sharma
  • Loading...

More Telugu News