tarun bhaskar: ఆర్థిక ఇబ్బందులు భయపెడుతూ ఉండగా సక్సెస్ వచ్చింది: తరుణ్ భాస్కర్

  • నాన్న చనిపోయాడు 
  • ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముట్టాయి
  • అద్దె ఇంట్లో ఉండేవాళ్లం        

తెలుగు తెరకి కొంతకాలం క్రితం పరిచయమైన సమర్థులైన దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరుగా కనిపిస్తాడు. తొలి ప్రయత్నంతోనే హిట్ కొట్టేసి అటు ఇండస్ట్రీ దృష్టిని .. ఇటు ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. అలాంటి తరుణ్ భాస్కర్ తాజాగా ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మా నాన్న చనిపోయిన తరువాత 'పెళ్లి చూపులు' ప్రాజెక్టు చేతికి వచ్చింది. అప్పుడు ఆర్ధికంగా నేను చాలా ఇబ్బందుల్లో వున్నాను.

మా అమ్మ జాబ్ చేస్తూ ఉండేది .. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. ఆర్ధిక పరమైన సమస్యలు నన్ను బాగా భయపెడుతూ ఉండేవి. ఆర్ధికంగా నిలదొక్కుకోగలుగుతానా? లేదా? అనే ఆందోళన ఉండేది. 'పెళ్లి చూపులు' విషయంలో నా ఆలోచనా విధానం సరైనదా కాదా అనే విషయంలో కూడా సతమతమవుతూ ఉండేవాడిని.. అందువలన రోజూ నిద్రపట్టేది కాదు. 'పెళ్లి చూపులు' హిట్ అయిన తరువాత మనసు కుదుటపడింది .. పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఈ సినిమా సక్సెస్ నాపై నాకు నమ్మకాన్ని కలిగించింది .. ఆత్మస్థైర్యాన్ని పెంచింది" అని చెప్పుకొచ్చాడు.       

tarun bhaskar
  • Loading...

More Telugu News