Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు కళా వెంకట్రావు ఘాటు లేఖ

  • టీడీపీ దీక్షకు పవన్ సంఘీభావం తెలపలేదు   
  • రైల్వేజోన్, గిరిజన వర్శిటీ తదితర అంశాలపై స్పందన లేదు 
  • కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఘాటుగా ఓ బహిరంగ లేఖ రాశారు. విశాఖ రైల్వేజోన్, గిరిజన యూనివర్శిటీ, కాపు రిజర్వేషన్ బిల్లు, సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ తదితర అంశాలపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

అదే విధంగా, ఉత్తరాంధ్ర అభివృద్ధి నిమిత్తం ఇచ్చిన రూ.150 కోట్లు కేంద్రం వెనక్కి తీసుకున్న విషయమై పవన్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీలు విశాఖపట్టణంలో దీక్ష చేస్తే సంఘీభావం తెలపని పవన్ విమర్శలు మాత్రం చేస్తున్నారని ఆ లేఖలో మండిపడ్డారు.

Pawan Kalyan
kala venkatrao
  • Loading...

More Telugu News