love: ప్రేమించి పెళ్లి చేసుకుని.. అమ్మాయిని కువైట్‌లో వదిలేసి వచ్చిన యువకుడు

  • కడప జిల్లాలో ఘటన
  • రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన యువకుడు
  • ఎలాగోలా అక్కడి నుంచి వచ్చిన యువతి
  • తన భర్త ఇంటి ముందు ధర్నా

ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి నమ్మించి ఓ యువతిని కువైట్‌కు తీసుకెళ్లిన ఓ యువకుడు ఆమెను అక్కడే పెళ్లి చేసుకుని, వదిలేసి వచ్చాడు. మళ్లీ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు.. ఎలాగోలా అక్కడి నుంచి వచ్చిన ఆ యువతి తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. కడప జిల్లా బద్వేలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త షరీఫ్‌ తనను మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని సదరు యువతి సాయి ప్రత్యూష మీడియాకు తెలిపింది. తనకు న్యాయం జరిగేవరకు ఆందోళన కొనసాగిస్తానని చెప్పింది.                                    

love
marriage
Kadapa District
  • Loading...

More Telugu News