Special Category Status: ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం అన్యాయం: సీఎం చంద్రబాబు

  • ఆంధ్రప్రదేశ్‌కి ఎన్డీఏ నమ్మకద్రోహం చేసింది
  • మనం చెల్లించే పన్నులు తీసుకుంటున్నారు
  • ఇక్కడి అభివృద్ధికి పైసా ఇవ్వట్లేదు
  • ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని చెప్పినా ముందుకు రాలేదు

ఆంధ్రప్రదేశ్‌కి ఎన్డీఏ నమ్మకద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి ఏపీకి హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర సర్కారు చెప్పిందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం అన్యాయమని అన్నారు. మనం చెల్లించే పన్నులు తీసుకుంటూ ఇక్కడ అభివృద్ధికి పైసా ఇవ్వట్లేదని అన్నారు.

అండగా ఉంటామని చెప్పి నమ్మకద్రోహం చేసిందని, ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని చెప్పినా ముందుకు రాలేదని అన్నారు. కేవలం తనపై విమర్శలు చేయడమే పనిగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఏపీ ప్రజల హక్కుల కోసం రాజీపడే ప్రసక్తే లేదని, హక్కుల కోసం అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వ నేతలు ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Special Category Status
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News