Chiranjeevi: అన్న చిరంజీవి నాకు తుపాకీ కొనిచ్చిన కారణమిదే: పవన్ కల్యాణ్

  • ఎక్కడ తీవ్రవాద ఉద్యమానికి వెళతానోనని భయపడ్డారు 
  • తుపాకి కొనిస్తే సరిపోతుందని భావించారు
  • తన ఆవేశం అన్యాయంపైనేనన్న పవన్ కల్యాణ్
  • విశాఖలో జనసేన పార్టీ సమావేశం

తనకున్న ఆవేశానికి, అన్యాయానికి ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లోకి పోతాడోనన్న ఆందోళనతో, ఓ తుపాకీ కొనిస్తే ఇంట్లోనే ఉంచవచ్చని ఆలోచించి, ఆనాడు తన అన్నయ్య చిరంజీవి తనకు ఓ తుపాకీని కొనిచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

విశాఖపట్నం కళావాహిని పోర్ట్ స్డేడియంలో జనసేన పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూ, తన అవేదన, ఆవేశం అన్యాయం మీదనే తప్ప, తుపాకీ కోసం కాదని ఆనాడు తన అన్నకు వివరించలేకపోయానని చెప్పారు. ఆనాడు దాన్ని తీసుకున్న వేళ ఎలా వాడాలో కూడా తెలియలేదని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తుంటే ప్రశ్నించకుండా ఎలా ఉండగలుగుతానని, రోడ్లపైకి వచ్చి నిలదీయకుండా ఎలా ఉండగలనని అన్నారు.

Chiranjeevi
Pawan Kalyan
Jana Sena
Vizag
Gun
  • Loading...

More Telugu News