trivikram: త్రివిక్రమ్ తో బన్నీ మూడో మూవీకి రంగం సిద్ధం

  • ఎన్టీఆర్ మూవీతో త్రివిక్రమ్ బిజీ 
  • విక్రమ్ కుమార్ ప్రాజెక్టుతో బన్నీ
  • ఇది పూర్తికాగానే త్రివిక్రమ్ తో సెట్స్ పైకి

లవ్ .. సెంటిమెంట్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఇలా అన్ని అంశాలను కలుపుతూ త్రివిక్రమ్ తన సినిమాలకి కథలను తయారు చేసుకుంటూ ఉంటాడు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆ కథను తెరపై ఆవిష్కరిస్తూ ఉంటాడు. అలాంటి త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో వుండనుందని తెలుస్తోంది.

గతంలో త్రివిక్రమ్ తో 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' చేసిన అల్లు అర్జున్, మళ్లీ ఆయనతో చేయడానికి కొంతకాలంగా ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఆయనకి ఒక కథ చెప్పడం .. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'అరవింద సమేత ..' చేస్తోన్న త్రివిక్రమ్, ఆ తరువాత చేసేది అల్లు అర్జున్ తోనే అనేది ఖాయమైపోయింది. ఈలోగా విక్రమ్ కుమార్ తో సినిమాను పూర్తి చేసేసి అల్లు అర్జున్ రెడీగా ఉంటాడన్న మాట.    

  • Loading...

More Telugu News