veeru potla: కృష్ణదేవరాయల కాలంనాటి కథలో మెగాహీరో?

  • తేజు తాజా చిత్రంగా 'తేజ్ ఐ లవ్ యూ'
  • రేపు భారీస్థాయిలో విడుదల 
  • నెక్స్ట్ మూవీ వీరు పోట్లతో

ఈ మధ్య దర్శకులు కొత్తదనం కోసం కాలంలో కొంతదూరం వెనక్కి వెళ్లి, అక్కడి నేపథ్యంతో కూడిన కథలను సిద్ధం చేసుకుని తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ తరహా కథలకు నీరాజనాలు పడుతుండటంతో, ఆ తరహా కథల రూపకల్పనకు దర్శకులు .. రచయితలు .. హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

తాజాగా ఇదే తరహా కథను సాయిధరమ్ తేజ్ ఎంచుకున్నట్టుగా సమాచారం. 'ఈడు గోల్డ్ ఎహే' సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న వీరు పోట్ల, కృష్ణదేవరాయల కాలంనాటి ఒక కథను సిద్ధం చేసుకుని సాయిధరమ్ తేజ్ కి వినిపించాడట. కథ .. కథనాలు విభిన్నంగా ఉండటంతో, వెంటనే సాయిధరమ్ తేజ్ ఓకే చెప్పేశాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక తేజు తాజా చిత్రంగా 'తేజ్ ఐ లవ్ యూ' రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 

veeru potla
sai dharam tej
  • Loading...

More Telugu News