kanna lakshminarayana: ప్రత్యేక హోదాపై మాట్లాడటం అనవసరం: కన్నా

  • ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం
  • రానున్న ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టండి
  • ప్రజల కన్నీరు తుడిచి, సుపరిపాలన అందిస్తాం

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దాని గురించి మాట్లాడటం అనవసరమని చెప్పారు. కావలిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే... ప్రజల కష్టాలు, కన్నీరు తుడిచి మంచి పాలనను అందిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళతామని తెలిపారు. ఏపీ విభజన హామీలకు సంబంధించి సుప్రీంకోర్టులో నిన్న కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అఫిడవిట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. 

kanna lakshminarayana
bjp
special status
  • Loading...

More Telugu News