Sasi Tharoor: ఎట్టకేలకు శశిథరూర్ కు ఊరట... భార్య మృతి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు

  • సునందా పుష్కర్ మృతి కేసులో శశిథరూర్ పై ఆరోపణలు
  • నేడో, రేపో అరెస్ట్ చేస్తారని వార్తలు
  • ముందస్తు బెయిల్ ఇచ్చిన పటియాలా కోర్టు

కాంగ్రెస్ నేత శశిథరూర్ కు పటియాలా హౌస్ కోర్టు ఊరటను ఇచ్చింది. తన భార్య మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ముందస్తు బెయిల్ ను కొద్దిసేపటి క్రితం మంజూరు చేసింది. సునంద ఆత్మహత్యకు శశిథరూర్ ప్రోద్బలం కూడా కారణమని పోలీసులు అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేడో, రేపో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో, ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆయన ఆశ్రయించగా, లక్ష రూపాయల పూచీకత్తుపై ముందస్తు బెయిల్ ను ఇస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

Sasi Tharoor
Sunanda Pushkar
Patiyala Court
  • Loading...

More Telugu News