Kerala: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన కేరళ రాజ్ భవన్ వాహనం.. జరిమానా విధించిన పోలీసులు

  • వేగపరిమితిని దాటి ప్రయాణించిన రాజ్ భవన్ వాహనం
  • సీసీ కెమెరాల్లో రికార్డు
  • ఆ సమయంలో కారులో లేని గవర్నర్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేరళ గవర్నర్ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు 400 రూపాయల జరిమానా విధించారు. దీంతో ఆ జరిమానా కట్టిరావలసిందిగా గవర్నర్ సదాశివం తన ఉద్యోగికి పురమాయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న రాజ్ భవన్ కు చెందిన సదరు వాహనం పరిమితికి మించి వేగంగా ప్రయాణించింది. దీంతో పోలీసులు జరిమానా విధించారు. అయితే, ఆ సమయంలో ఆ కారులో గవర్నర్ లేరని తెలుస్తోంది.

కౌడియార్-వెల్లయంబళం దారిలో రాజ్ భవన్ కు చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఈ-250 అత్యంత వేగంగా దూసుకెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన అధునాతన కెమెరాలు దీనిని రికార్డు చేశాయి. కేరళ గవర్నర్ సెక్రటరి పేరుపై రిజిస్టర్ అయి ఉన్న ఈ వాహనం 55 కిలోమీటర్ల వేగ పరిమితిని దాటేసింది. నిజానికి గత కొంతకాలంగా ఈ వాహనాన్ని గవర్నర్ ఉపయోగంచడం లేదు. రాజ్ భవన్ కు సంబంధించిన వేరే పనులకు దానిని వినియోగిస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే, రాజ్ భవన్ ఉద్యోగులంతా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ గవర్నర్ ఈ సందర్భంగా వారికి క్లాస్ పీకారట.

  • Error fetching data: Network response was not ok

More Telugu News