Bangladesh: 43/10... టెస్టుల్లో బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డు!
- తన రికార్డును తానే తిరగరాసుకున్న బంగ్లాదేశ్
- ఒక్క ఆటగాడు కూడా రెండంకెల స్కోరును చేరని వైనం
- చెలరేగిపోయిన విండీస్ బౌలర్ కీమర్ రోచ్
నార్త్ సౌండ్ లో వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. బ్యాట్స్ మెన్ వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్ దారి మళ్లారు. ఒక్కరు కూడా రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. విండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ చెలరేగి 5 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అతనికి మిగ్వెల్ 3 వికెట్లు తీసి, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసి సహకరించారు.
4, 1, 0, 0, 0, 4, 1, 0, 6, 2... ఇవీ బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన స్కోర్. 141 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇది రెండో అతి తక్కువ ఇన్నింగ్స్ 1955లో ఇంగ్లండ్ పై ఆడిన న్యూజిలాండ్ జట్టు 26 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తరువాతి చెత్త రికార్డు బంగ్లాదేశ్ దే. 2007లో శ్రీలంకపై 62 పరుగులకు కుప్పకూలిన బంగ్లాదేశ్, తన రికార్డును తాను మరోసారి దిగజార్చుకుంది.