Laloo Prasad Yadav: లాలూ కోడలు ఐశ్వర్యారాయ్ రాజకీయ రంగ ప్రవేశం!

  • ఐశ్వర్య పేరిట వెలసిన పోస్టర్లు, బ్యానర్లు
  • శరణ్ నుంచి ఎంపీ పదవికి బరిలోకి
  • మే 29న తేజ్ ప్రతాప్ తో వివాహం

బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి దంపతుల కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్వర్యారాయ్ త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మే 29న తేజ్ తో ఆమె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 1970 దశకంలో బీహార్ సీఎంగా పనిచేసిన దరోగారాయ్ మనవరాలైన ఐశ్వర్య.. శరణ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ పడతారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె ఫొటోలతో బ్యానర్లు, పోస్టర్లు వీధుల్లో కనిపిస్తున్నాయి. ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వెలసిన పోస్టర్లలో ఇప్పుడామే ప్రత్యేక ఆకర్షణ. శరణ్ నుంచి దాదాపు 20 సంవత్సరాల పాటు ఐశ్వర్య తండ్రి చంద్రికారాయ్ ఎంపీగా పనిచేశారు. ఆమె పుట్టింటి, అత్తింటి నేపథ్యాలు రాజకీయాలతో ముడిపడివుండటంతో ఆమె రాజకీయాల్లో రాణిస్తారని ఆర్జేడీ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Laloo Prasad Yadav
Aishwarya Rai
Tej Pratap Yadav
Bihar
Saran
Politics
  • Loading...

More Telugu News