Nara Lokesh: జీవీఎల్‌కు లోకేశ్ సవాల్.. దమ్ముంటే ఆ పేర్లు బయటపెట్టాలని డిమాండ్!

  • కేంద్రమంత్రి, బ్రోకర్ పేర్లు బయటపెట్టాలని డిమాండ్
  • జీవీఎల్ నైజమే వేరని విమర్శ
  • ట్విట్టర్ ఖాతాలో నిప్పులు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. తాజాగా బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావు తనపై చేసిన ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కేంద్రమంత్రి వద్దకు తాను బ్రోకర్‌ను పంపానంటున్న జీవీఎల్ దమ్ముంటే దానిని నిరూపించాలని సవాలు విసిరారు. ఆ మంత్రి ఎవరో, తాను పంపించిన బ్రోకర్ ఎవరో పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

జీవీఎల్ నైజమే వేరని, అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో ఆయన సిద్ధహస్తుడని మండిపడ్డారు. ఢిల్లీలో లాబీయింగ్ అంటూ జీవీఎల్ మరో కట్టుకథ మొదలుపెట్టారని అన్నారు. అసత్యాలను ప్రచారం చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ధ్వజమెత్తారు.

Nara Lokesh
GVL
Telugudesam
BJP
  • Loading...

More Telugu News