praveen Thogadia: ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు.. కేంద్రానికి సరికొత్త ప్రతిపాదన

  • ముస్లింలకు మైనారిటీ హోదా తొలగించాలి
  • ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేయాలి
  • కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైంది

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని విషయాల్లోనూ కేంద్రం విఫలమైందని ఆరోపించిన ఆయన, దేశంలోని ముస్లింలకు మైనారిటీ హోదా తీసివేయాలని, ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర సర్కారు విఫలమైందన్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు.

తానైతే హిందూత్వ ఎజెండాతోపాటు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తానని అన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు, పంటలకు మద్దతు ధర అమలుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగాడియా విమర్శించారు. దేశంలో ఎటు చూసినా రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయాయని, వాటిని పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‌రాజస్థాన్‌లోని వసుంధరరాజే ప్రభుత్వంపైనా ప్రవీణ్ తొగాడియా నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News