Karnataka: కర్ణాటక ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు.. గాంధీ పోటీ చేసినా రూ.10 కోట్లు ఖర్చు చేయాల్సిందేనన్న ఇబ్రహీం

  • ఎమ్మెల్సీ ఇబ్రహీం వివాదాస్పద వ్యాఖ్యలు
  • ప్రజలకు సంక్షేమ పథకాలు పట్టడం లేదని విమర్శ
  • నాయకులు పంచే తాయిలాల కోసమే చూస్తున్నారని వ్యాఖ్య

కర్ణాటక ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు ఎంతో ఖరీదైపోయాయన్న ఆయన స్వయంగా మహాత్మాగాంధీ ఎన్నికల బరిలోకి దిగినా నోట్ల కట్టలు పట్టుకోవాల్సిందేనని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు మరింత ఖరీదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. గాంధీ పోటీచేసినా అంత మొత్తం ఖర్చు చేయక తప్పదన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వారికి పట్టడం లేదని, పోలింగ్ రోజు నాయకులు పంచే తాయిలాల గురించే వారు ఆలోచిస్తున్నారంటూ ఇబ్రహీం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

Karnataka
MLC
Ibrahim
Gandhi
Elections
  • Loading...

More Telugu News