Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి మర్చిపోలేని గుణపాఠం చెబుతారు: లోకేశ్
- సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు అఫిడవిట్ దాఖలు
- ఏపీకి ఏమీ ఇవ్వబోమన్నట్లు పేర్కొన్నారు
- ఇది ద్రోహం, వంచనే.. బీజేపీ సిగ్గుపడాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల అంశంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించారు. సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఏపీకి ఏమీ ఇవ్వబోమని పేర్కొన్నారని, ఇది ద్రోహం, వంచనేనని అన్నారు. కాంగ్రెస్ ఏపీ ప్రజల నడ్డి విరిస్తే, బీజేపీ నమ్మకద్రోహం చేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి మర్చిపోలేని గుణపాఠం చెబుతారని అన్నారు. బీజేపీ సిగ్గుపడాలని పేర్కొన్నారు.
కాగా, లోకేశ్ మరో ట్వీట్ చేస్తూ... అసత్యం చెప్పి నిజం అని నమ్మించే రకం బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లాబీయింగ్ అంటూ మరో కట్టుకథ మొదలుపెట్టారని పేర్కొన్నారు. అసత్యాలు ప్రచారం చేయడం బీజేపీ నాయకులకు జబ్బుగా మారిందని అన్నారు.