Maharashtra: మరో వివాదం.. బాలికల లోదుస్తుల రంగుపై పూణె స్కూల్‌ అధికారుల నిబంధనలు

  • మహారాష్ట్రలోని పూణెలో ఘటన
  • విశ్వశాంతి గురుకుల్‌ విద్యా సంస్థ విచిత్ర ఆదేశాలు
  • మండిపడుతూ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

విద్యాలయాలకు బాలికలు జీన్సు ప్యాంట్లు, టీషర్టులు వంటి దుస్తులు వేసుకురావద్దంటూ పలు విద్యా సంస్థలు చేస్తోన్న సూచనలు వివాదాస్పదమవుతోన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ విద్యా సంస్థ అంతకు మించి వివాదాస్పద చర్యకు పాల్పడింది. బాలికల లోదుస్తుల రంగుపై అక్కడి విశ్వశాంతి గురుకుల్‌ విద్యా సంస్థ ఉత్తర్వులు జారీ చేసి దుమారం రేపింది.

ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇచ్చిన డైరీల్లో నియమ నిబంధనలు పేర్కొంటూ.. బాలికలు తెలుపు రంగు లోదుస్తులు మాత్రమే వేసుకోవాలని ఆదేశించారు. ఆ పాఠశాల యాజమాన్యం ఈ ఆదేశాలను బలవంతంగా తమపై రుద్దుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన పాఠశాల యాజమాన్యం బాలికల భద్రత కోసమే అని చెప్పుకొచ్చింది. వారి సమాధానంతో ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. 

  • Loading...

More Telugu News