reporting: జోరు వాన.. స్విమ్మింగ్ పూల్‌ను తలపించిన రోడ్డు.. అక్కడి నుంచే రిపోర్టింగ్.. వీడియో వైరల్
- పాక్‌లోని లాహోర్‌లో ఘటన
- పరిస్థితిని వివరించి చెప్పడానికి నీళ్లలోకి రిపోర్టర్
- రోడ్డు స్విమ్మింగ్ పూల్లా ఉందని చెప్పిన జర్నలిస్ట్
జోరు వాన కురిసిందంటే చాలు.. చాలా నగరాల్లో రోడ్లపైనే నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే, ఈ పరిస్థితిని వివరించి చెప్పడానికి ఓ రిపోర్టర్ వినూత్న మార్గాన్ని ఎంచుకుని, పూర్తిగా నీళ్లలోకి దిగి రిపోర్టింగ్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఓ రోడ్డు స్విమ్మింగ్ పూల్‌ను తలపిస్తోందని చెబుతూ.. ఈత నేర్చుకోవడానికి ఉపయోగించే ట్యూబ్‌లో కూర్చున్నాడు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉండే వాతావరణాన్ని అక్కడ సృష్టించి రోడ్డు మధ్యలో కూర్చుని అక్కడి పరిస్థితిని చెప్పాడు. నగరమంతా ఇదే పరిస్థితి ఉందని అన్నాడు.