Andhra Pradesh: సినిమా స్క్రిప్ట్‌ మాదిరి డైలాగ్‌లు చెబితే సరిపోతుందనుకుంటున్నారు: పవన్ పై కుటుంబరావు విమర్శలు

  • వ్యక్తులపై బురద చల్లి ఆ బురదను పవనే అంటించుకుంటున్నారు
  • విశాఖలో తిరుగుతూ రైల్వే జోన్‌పై ఒక్క మాటైనా మాట్లాడారా? 
  • బీజేపీ నేతలు చెబుతున్నవన్నీ అసత్యాలే

సినిమా స్క్రిప్ట్‌ మాదిరి డైలాగ్‌లు చెబితే సరిపోతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అనుకుంటున్నారని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వ్యక్తులపై బురద చల్లి పవన్‌ ఆ బురదను తానే అంటించుకుంటున్నారని అన్నారు. విశాఖపట్నంలో తిరుగుతూ రైల్వే జోన్‌పై ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.

కాగా, తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన బీజేపీ నేతలు కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజులకు నోటీసులు పంపానని కుటుంబరావు చెప్పారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 104 ప్రాజెక్టులు కేటాయించామని చెప్పడం అసత్యమని అన్నారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలు చూపిస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం పంపిన ఉత్తరాలు మీడియాకు ఎందుకు చూపరని ప్రశ్నించారు.

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చాక ప్రధాని ఇంతవరకు ఏపీ అంశాలపై నోరు విప్పలేదని, రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయం తెలుసు కాబట్టే నోరువిప్పలేకపోతున్నారని కుటుంబరావు అన్నారు. గృహ నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. బీజేపీని ఇప్పుడు అందరూ భారతీయ జుమ్లా పార్టీ అంటున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News