jagan: మాదిగలంతా జగన్ వెంటే!: మాదిగ ఐక్య వేదిక

  • చంద్రబాబు నమ్మించి మోసం చేశారు
  • మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాట తప్పారు
  • ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిగలను వంచించారని మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మడికి కిషోర్ బాబు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో... ఎస్సీ వర్గీకరణ చేసి, మాదిగల్లో పెద్ద మాదిగను అవుతానని చంద్రబాబు తమను నమ్మించారని, మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిన మాటను కూడా తప్పారని విమర్శించారు.

 మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మే ప్రసక్తి లేదని... జగన్ వెంటనే మాదిగలంతా ఉంటారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను కలిసిన మాదిగ ఐక్య వేదిక నేతలు... ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.

jagan
madiga ikya vedika
  • Loading...

More Telugu News