vangaveeti ranga: వంగవీటి రంగా అడుగుజాడల్లో నడవటం వల్లే నేను ఎమ్మెల్యే స్థాయికి ఎదిగా: జోగి రమేష్

  • పేదలకు మేలు చేయాలని తపించిన వ్యక్తి రంగా
  • రంగా ఫొటో పెట్టుకుని వచ్చే వారికి ఓట్లు వేయవద్దు
  • టీడీపీ నేతలే రంగాకు ద్రోహం చేశారు

దివంగత వంగవీటి రంగా పేదల మనిషని, ప్రజలకు మేలు చేయాలని తపించిన గొప్ప వ్యక్తి అని వైసీపీ నేత జోగి రమేష్ అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు మేలు చేసే నాయకత్వ లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి అని కొనియాడారు. రంగా ఫొటో పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చే వ్యక్తులను నమ్మవద్దని అన్నారు. నిరాహారదీక్ష చేస్తున్న రంగాను హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు.

టీడీపీ నేతలే రంగాకు ద్రోహం చేశారని తెలిపారు. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రంగా అని, ఆయన అడుగుజాడల్లో నడవడం వల్లే తాను ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని చెప్పారు. రంగా 71వ జయంతి సందర్భంగా రాధారంగా మిత్రమండలి, వైసీపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు. 

vangaveeti ranga
jogi ramesh
YSRCP
  • Loading...

More Telugu News