East Godavari District: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన బీజేపీ నేత

  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న మండపేట బీజేపీ ఇన్ఛార్జ్ సత్య ప్రసాద్
  • గతంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్  
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో... రాజకీయపార్టీల్లో వేడి పెరిగింది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వలసలు మొదలయ్యాయి. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా మండపేట బీజేపీ ఇన్ ఛార్జి రెడ్డి వీరవెంకట సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి ఆయనను చంద్రబాబు సగౌరవంగా ఆహ్వానించారు. గతంలో ఆయన జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ గా కూడా పని చేశారు. సత్యప్రాద్ టీడీపీలో చేరడం తూర్పుగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

East Godavari District
mandapeta
bjp
incharge
veera venkata satya prasad
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News