China: భారత్‌లో ఇక చైనా ప్రభుత్వ రంగ దిగ్గజం 'బ్యాంక్ ఆఫ్ చైనా'.. లైసెన్సు జారీ
- ఆర్‌బీఐ కీలక నిర్ణయం
- ఇప్పటికే 'ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్'
- మరో 45 విదేశీ బ్యాంకులు
చైనా ప్రభుత్వ రంగ దిగ్గజం 'బ్యాంక్ ఆఫ్ చైనా' ఇక భారత్‌లోనూ తమ కార్యకలాపాలు నిర్వహించడానికి లైన్ క్లియర్ అయింది. అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు లైసెన్సు జారీ చేసింది. ఇప్పటికే మన దేశంలో చైనాకు చెందిన ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ ఉంది. అంతేగాక, ఇతర దేశాల బ్యాంకులు మరో 45 ఉన్నాయి. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిపిన చర్చల్లో బ్యాంక్ ఆఫ్ చైనా ప్రస్తావన రాగా, ఆ బ్యాంక్ కార్యకలాపాలు జరిపేందుకు అనుమతినిస్తామని మోదీ హామీ ఇచ్చారు.