suzuki: సుజుకి మ్యాక్సీ స్కూటర్ బుర్గ్ మ్యాన్ స్ట్రీట్... ఈ నెల 18న విడుదల

  • ధర రూ.70,000 దరిదాపుల్లో
  • బుకింగ్స్ తీసుకుంటున్నడీలర్లు
  • స్కూటర్ లుక్స్ మాత్రం భిన్నం

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తొలిసారిగా ఓ మ్యాక్సీ స్కూటర్ ‘బుర్గ్ మ్యాన్ స్ట్రీట్’ను భారత మార్కెట్లో ఈ నెల 18న విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్ ను ఈ ఏడాది మొదట్లో జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో సుజుకి ప్రదర్శించింది. 125సీసీ సామర్థ్యంతో ఉండే ఈ స్కూటర్ ఇంజన్ ను యాక్సెస్ 125 నుంచే తీసుకోవడం జరిగింది. కాకపోతే బాడీ లుక్స్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. ఆధునిక డిజైన్ తో కుర్రకారును ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ స్కూటర్ 18న విడుదల కానుండగా, డీలర్లు ఇప్పటి నుంచే రూ.5,000తో బుకింగ్స్ తీసుకుంటున్నారు.

సుజుకి బుర్గ్ మ్యాన్ స్ట్రీట్ సీటు కొంచెం పొడవుగా ఉంటుంది. సీటు కింద స్టోరేజీ కూడా ఎక్కువే. ఇందులో డిజిటల్ స్పీడియో మీటర్, డిస్క్ బ్రేకింగ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటాయి. హోండా గ్రేజియా, సుజుకి ఎన్ టార్క్, పియాజియో అప్రీలియా 125 కు పోటీనివ్వనుంది. దీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూమ్ రూ.70,000 దరిదాపుల్లో ఉండొచ్చని అంచనా.

  • Error fetching data: Network response was not ok

More Telugu News