Warangal Rural District: వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం... నలుగురి సజీవ దహనం

  • కోటిలింగాల వద్ద ఘటన
  • బాణాసంచా గోడౌన్ కు మంటలు
  • కాలిన గాయాలతో పరుగులు పెట్టిన 9 మంది

వరంగల్‌ పరిధిలోని కోటిలింగాల వద్ద ఉన్న ఓ బాణసంచా గోడౌన్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించగా, అందులో పనిచేస్తున్న నలుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గోడౌన్ లో భారీ ఎత్తున బాణసంచా ఉండటంతో అవన్నీ పేలుతుండటం వల్లే మంటలను అదుపు చేయడం కష్టంగా ఉందని, మరికాసేపట్లో మంటలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు.

కాగా, మంటలంటుకున్న సమయంలో గోడౌన్ లో 13 మంది పని చేస్తుండగా, 9 మంది పరుగులు పెడుతూ బయటకు వచ్చారు. వీరికి కూడా కాలిన గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Warangal Rural District
Kotilingala
Fireworks
Godown
Fire Accident
  • Loading...

More Telugu News