NTR: రెండో కొడుక్కి పేరు పెట్టిన ఎన్టీఆర్.. బాగుందంటూ కామెంట్లు!

  • 14న పండంటి బాబుకు జన్మనిచ్చిన లక్ష్మీ ప్రణతి
  • భార్గవ రామ్ అని నామకరణం చేసిన ఎన్టీఆర్
  • సోషల్ మీడియాలో వెల్లడి

గత నెల 14వ తేదీన హీరో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు పుట్టిన రెండో మగబిడ్డ నామకరణం జరిగిపోయింది. తన చిన్న కొడుకుకు భార్గవ రామ్ అని పేరు పెట్టినట్టు ఎన్టీఆర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాల ద్వారా ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నాడు. తన ఇంట్లో పండగ వాతావరణమని, ఆనందించే సమయమని చెప్పాడు. పెద్ద కుమారుడికి తాతయ్య రామారావు పేరు కలిసొచ్చేలా అభయ్ రామ్ అని పేరు పెట్టుకున్న ఎన్టీఆర్, చిన్న కుమారుడికి సైతం అదే సెంటిమెంట్ తో పేరును పెట్టాడు. ఈ పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతుండగా, పేరు బాగుందన్న కామెంట్లు వస్తున్నాయి.

NTR
Second Son
Social Media
Bhargav Ram
  • Error fetching data: Network response was not ok

More Telugu News