Ayesha Takiya: నటి ఆయేషా టకియాకు వేధింపులు... సాయపడాలంటూ మోదీ, సుష్మాలకు విజ్ఞప్తి!

  • ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
  • ట్విట్టర్ లో ఆరోపించిన ఆయేషా భర్త ఫర్హాన్
  • తెలుగులో 'సూపర్' చిత్రంలో నటించిన ఆయేషా

తెలుగులో 'సూపర్' చిత్రంతో సినీ ప్రేక్షకులను పలకరించిన ఆయేషా టకియాను, ఆమె కుటుంబీకులను ఓ వ్యక్తి వేధిస్తున్నాడట. చంపేస్తానని బెదిరిస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయేషా భర్త ఫర్హాన్ అజ్మీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్ లు తమకు సాయపడాలని విజ్ఞప్తి చేస్తూ 'బేటీ బచావో' అని ఓ పోస్టు పెట్టాడు.

తన భార్యతో పాటు అమ్మ, అక్క చెల్లెళ్లు బెదిరింపులకు గురయ్యారని చెప్పాడు. డీసీపీ దహియాకు ఫిర్యాదు చేస్తే ఆయన చూసీ చూడనట్టు ఊరుకున్నారని ఆరోపిస్తూ, దహియాకు చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్లను ఫర్హాన్ పోస్టు చేసి, తమకు మద్దతు తెలపాలని నెటిజన్లను కోరాడు. ఆయన వరుసగా ట్వీట్లు పెడుతుండటంతో ముంబై జాయింట్ సీపీ దేవేన్ భారతి స్పందించి, విచారించి నిందితుడిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు.

Ayesha Takiya
Farhan Azmi
Twitter
Narendra Modi
Sushmaswaraj
Mumbai
Police
Harrasment
  • Loading...

More Telugu News