Telugudesam: టీడీపీలోకి ఫిరాయిస్తే రూ. 40 కోట్లు ఇస్తారట... లేకుంటే కేసులు పెడతారట: వైసీపీ ఎమ్మెల్యే సునీల్ సంచలన ఆరోపణలు!

  • టీడీపీ నేతలు సంప్రదిస్తున్నారు
  • ఇబ్బంది పెడతామని బెదిరిస్తున్నారు
  • తప్పుడు కేసులకు భయపడబోనన్న సునీల్

తాను తెలుగుదేశం పార్టీలో చేరితే రూ. 40 కోట్లు ఇస్తామని ఆశ పెడుతున్నారని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ ఎం సునీల్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పుంగనూరు మండలం మోటుమల్లెల గ్రామంలో మాట్లాడిన ఆయన, టీడీపీ నాయకులు తనను సంప్రదిస్తూ బేరాలు ఆడుతున్నారని, వారి మాట వినకుంటే కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అంశంపై పెట్టే శ్రద్ధను రాష్ట్రాభివృద్ధిపై, ప్రజల సంక్షేమంపై పెట్టుంటే బాగుండేదని అన్నారు. తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడబోనని, వైకాపాను వీడనని స్పష్టం చేశారు.

Telugudesam
Chittoor District
Putalapattu
YSRCP
Sunil Kumar
  • Loading...

More Telugu News