Jharkhand: ఓ చేత్తో కత్తి, మరో చేత్తో అమ్మాయి తల... రెండు గంటల పాటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన వ్యక్తి!

  • జార్ఖండ్ లో కలకలం రేపిన ఘటన
  • ఉపాధ్యాయురాలి తల నరికిన మానసిక రోగి
  • ఆపై రెండు గంటల పాటు హల్ చల్

ఒక చేత్తో మొండెం లేని యువతి తలను పట్టుకుని వీధుల్లో ఓ వ్యక్తి పరుగులు పెడుతుంటే, అతన్ని పట్టుకునేందుకు పోలీసులు, స్థానికులు రెండు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. జార్ఖండ్ లోని జమ్ షడ్ పూర్ లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు.

మానసిక వికలాంగుడైన హరీ హెంబ్రామ్ అనే వ్యక్తి, సేరైకేలాలోని ఖప్రసాయ్ ప్రైమరీ స్కూల్ వద్దకు మధ్యాహ్న భోజన సమయంలో వెళ్లి, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని బయటకు పిలిచాడు. ఆమెపై దాడి చేసి పదునైన ఆయుధంతో దారుణంగా ఆమె తల నరికాడు. ఆపై తలను చేత్తో పట్టుకుని పరుగు లంఘించుకున్నాడు. అతన్ని స్థానికులు తరుముతుండగా, పోలీసులకు సమాచారం వెళ్లింది. స్థానికులు అతన్ని కొట్టి చంపేందుకు ప్రయత్నించిన క్రమంలో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. మృతురాలిని సుక్రా హేసా (30)గా గుర్తించామని తెలిపారు.

నిందితుడి వద్ద రెండు కత్తులు ఉండటంతో అతని దగ్గరకు వెళ్లేందుకు చాలాసేపు తటపటాయించాల్సి వచ్చిందని, ఘటనా స్థలికి 5 కిలోమీటర్ల దూరంలోని అడవిలో అతన్ని పట్టుకున్నామని ఓ అధికారి చెప్పారు. స్థానిక ప్రజలు అతనిపై దాడికి దిగబోగా, వారిని అడ్డుకోవడం క్లిష్టతరమైందని అన్నారు.

Jharkhand
Teacher
Beheaded
Police
  • Loading...

More Telugu News