Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు!

  • అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ
  • తొలి భారతీయుడిగా, తొలి క్రికెటర్‌గా ఘనత
  • బ్రెండన్ మెకల్లమ్ రికార్డు బద్దలు

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. పురుషుల టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా, తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. మంగళవారం ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన తొలి టీ20లో 20 పరుగులు చేసిన కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.

దీంతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. మెకల్లమ్ 66 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ అతడి కంటే పది మ్యాచ్‌ల ముందే.. అంటే 56వ ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డును అందుకున్నాడు. కాగా, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కివీస్‌కే చెందిన మార్టిన్ గప్టిల్ 2,271 పరుగులతో అందరికంటే ముందున్నాడు.

Virat Kohli
Team India
t20
World Record
  • Loading...

More Telugu News