Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ పెళ్లి... బెంగళూరుకు కేటీఆర్!

  • వివాహానికి పూర్తయిన ఏర్పాట్లు 
  • బెంగళూరులోని ప్రిన్సెస్‌ ష్రైన్‌ ప్యాలెస్‌ లో పెళ్లి
  • హాజరుకానున్న పలువురు ప్రముఖులు

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే వివాహానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. బెంగళూరుకు చెందిన విజేత అనే వధువును ఆయన నేడు వివాహమాడనున్నాడు. బెంగళూరులోని ప్రిన్సెస్‌ ష్రైన్‌ ప్యాలెస్‌ లో పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేయగా, నిన్న ఆయన్ను పెళ్లి కుమారుడిని చేశారు. రాహుల్ హెగ్డే వివాహానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ తో పాటు మరికొందరు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

Rajanna Sircilla District
Rahul Hegde
Bengalore
KTR
  • Loading...

More Telugu News