Hyderabad: లంగర్‌హౌజ్‌లో దారుణం.. పదేళ్ల బాలుడిపై అఘాయిత్యం.. హత్య?

  • హైదరాబాద్‌లో దారుణం
  • నిందితుల కోసం పోలీసుల వేట
  • కలకలం రేపుతున్న ఘటన

హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో దారుణం జరిగింది. పదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

విషయం బయటకు తెలియకూడదన్న ఉద్దేశంతోనే నిందితులు బాలుడిని హత్య చేసి ఉంటారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, బాలుడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad
Murder
langer house
Boy
  • Loading...

More Telugu News