Pawan Kalyan: దుర్మార్గులు, దోపిడీదారులకు వెన్నుచూపొద్దు: జనసేన శ్రేణులకు పవన్ పిలుపు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-da90b1e98453abf32d1acf6d24a156e5db453004.jpg)
- సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే సత్తా ఉన్నా వదిలేశా
- రాజకీయాలంటే నాకు సరదా కాదు బాధ్యత
- రంపచోడవరం సభలో పవన్ కల్యాణ్
దుర్మార్గులు, దోపిడీదారులు, శత్రువులకు వెన్ను చూపొద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రంపచోడవరంలో జరిగిన ప్రజాపోరాట యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ, సినిమాల్లో కోట్లాది రూపాయలు సంపాదించే సత్తా ఉండి కూడా తాను అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయాలంటే తనకు సరదా కాదని, ‘బాధ్యత’ అని చెప్పారు. రాజకీయాలన్నాక కష్టాలునష్టాలుంటాయని, మాటలు పడాల్సి వస్తుందని..ఇలా అన్నింటినీ ఎదుర్కొంటామే తప్ప, పారిపోయే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.