prathipati pullarao: పవన్ కు అనుభవం లేదు.. జగన్ దోపిడీదారు: ప్రత్తిపాటి

  • ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీనే ప్రజలు గెలిపిస్తారు
  • అన్యాయం చేసిన బీజేపీకి బుద్ధి చెబుతారు

వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. జగన్, పవన్ లను ప్రజలు నమ్మరని అన్నారు. జగన్ దోపిడీదారుడైతే... ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని... వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారని చెప్పారు. ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని, ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ప్రజలు టీడీపీ వెంటే ఉంటారని చెప్పారు.

prathipati pullarao
Chandrababu
jagan
Pawan Kalyan
  • Loading...

More Telugu News