kohli: ఇంగ్లండ్ ను వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం కష్టమే: కోహ్లీ

  • ఇంగ్లండ్ పర్యటనలో సత్తా చాటుతా
  • సొంత గడ్డపై వారిని ఎదుర్కోవడం సవాలే
  • ఆటగాళ్లంతా సమష్టిగా ఆడుతూ, విజయం సాధిస్తాం

అన్ని దేశాల్లో మెరుగైన ఆట తీరును ప్రదర్శించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఇంగ్లండ్ గడ్డపై మాత్రం ఇంతవరకు చెలరేగలేకపోయాడు. ఈ పర్యటనలో మాత్రం సత్తా చాటుతానంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఈరోజు రాత్రి ఇంగ్లండ్ తో తొలి టీ20 జరగబోతోంది.

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, విదేశీ పర్యటనల కోసం తామంతా ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటామని చెప్పాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డపై వారిని ఎదుర్కోవడం మాత్రం ఎప్పుడూ సవాలేనని అన్నాడు. ఇగ్లండ్ ను వారి సొంత గడ్డపై ఓడించడానికి ఇదే సరైన సమయమని చెప్పాడు. జట్టు సభ్యులంతా సమష్టిగా ఆడుతూ, విజయం సాధిస్తామని తెలిపాడు. ప్రపంచ కప్ కు ముందు ఇంగ్లండ్ లో జరుగుతున్న ఈ సుదీర్ఘ పర్యటన టీమిండియాకు ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు.

kohli
team india
england tour
t20
  • Loading...

More Telugu News