amazon india: ఈ నెల 16న అమేజాన్ ప్రైమ్ డే సేల్... 200 ఉత్పత్తుల విడుదల... తక్కువ ధరల ఆఫర్లు

  • 36 గంటల పాటు విక్రయాలు
  • అతి తక్కువ ధరలకే ఆఫర్లు
  • ఆర్డర్ చేసిన రెండు గంటల్లో డెలివరీ

అమేజాన్ ఇండియా పోర్టల్ ప్రైమ్ డే సేల్ ను ఈ నెల 16న ప్రారంభించనుంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలయ్యే విక్రయాలు మరుసటిరోజు అర్ధరాత్రి 11.59 వరకు అందుబాటులో ఉంటాయి. 36 గంటల పాటు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రముఖ బ్రాండ్ల నుంచి 200 ఉత్పత్తులు ప్రత్యేకంగా అమేజాన్ సైట్లోనే విడుదల కానున్నాయి. అమేజాన్ ప్రైమ్ సభ్యులు వేలాది డీల్స్ ను తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చని అమేజాన్ ఇండియా మేనేజర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. అమేజాన్ భారత్ సహా 17 దేశాల్లో ప్రైమ్ సేల్ నిర్వహిస్తోంది.

రోజువారీ నిత్యావసరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులను ఏడాదిలోనే అత్యంత తక్కువ ధరలకు ప్రైమ్ సేల్ లో ఆఫర్ చేయనుంది. అంతర్జాతీయ సెల్లర్ల ఆఫర్లను కూడా భారతీయ కస్టమర్లకు అందిస్తామని అమేజాన్ తెలిపింది. ఇక ఈ సేల్ లో భాగంగా రెండు గంటల్లో డెలివరీ సర్వీస్ ను అమేజాన్ పరీక్షించనుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, అమేజాన్ పరికరాలు, నిత్యావసరాలను ఆర్డర్ చేసిన రెండు గంటల్లోపు అందించనుంది. అమేజాన్ ఇటీవలే రూ.129తో నెలవారీ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.

amazon india
prime sale
  • Loading...

More Telugu News