Sachin Tendulkar: ఇన్నాళ్లకు 'హాల్' లోకి 'వాల్' వచ్చింది: సచిన్ ఫన్నీ ట్వీట్!

  • మేటి క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్
  • ఇటీవలే 'హాల్ ఆఫ్ ఫేమ్' లోకి
  • అభినందనలు తెలిపిన సచిన్ టెండూల్కర్

తన దీర్ఘకాల సహచరుడు, ప్రపంచంలోని మేటి క్రికెటర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు 'హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం కల్పిస్తూ, ఐసీసీ సత్కరించిన తరువాత, సచిన్ ఓ ఫన్నీ ట్వీట్ తో తన సహచరుడిని అభినందించారు. ఇద్దరు ఆటగాళ్లూ క్రికెట్ కు విరామం ప్రకటించినా, తమ మధ్య స్నేహాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు.

తనతో కలసి ఎన్నో సంవత్సరాల పాటు జట్టుకు సేవలందించిన రాహుల్ ను అభినందిస్తూ, "ద్రావిడ్ కు శుభాకాంక్షలు.. ఎట్టకేలకు 'హాల్'లో 'వాల్'కు చోటు లభించింది. ఈ గౌరవానికి రాహుల్ పూర్తిగా అర్హుడు" అని వ్యాఖ్యానించారు. ఈ 'హాల్ - వాల్' ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ వైపు వరుసగా ఎన్ని వికెట్లు పడిపోతున్నా, మరోవైపు గోడ మాదిరి నిలబడి, అవుట్ కాకుండా ఆడే ద్రావిడ్ ను 'ది వాల్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News