Chandrababu: మేము హైదరాబాదులో లేమండీ.. మా అడ్రస్ మారింది: నీతి ఆయోగ్ కు ఏపీ సర్కారు లేఖ

  • చంద్రబాబుకు లేఖ రాసిన నీతి ఆయోగ్
  • వెలగపూడి, హైదరాబాద్ అంటూ అడ్రస్
  • తమ అడ్రస్ మారిందంటూ లేఖ రాసిన ఏపీ సర్కార్

ఏపీ సచివాలయం చిరునామా మారిందంటూ నీతి ఆయోగ్ కు ఆంధ్రప్రదేశ్ సర్కారు లేఖ రాసింది. వివరాల్లోకి వెళ్తే, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలన్న ప్రతిపాదనపై అధ్యయనానికి ముఖ్యమంత్రుల బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుడిగా ఏపీ సీఎం చంద్రబాబును నామినేట్ చేసినట్టు తెలుపుతూ ఆయనకు నీతి ఆయోగ్ లేఖ రాసింది. అయితే, ఆయన అడ్రస్ ను మాత్రం వెలగపూడి, హైదరాబాద్ అంటూ పేర్కొంది.

ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ కు ఏపీ సర్కారు లేఖ రాసింది. ఏపీ సచివాలయం హైదరాబాదులో లేదని... తమ అడ్రస్ మారిందని లేఖలో పేర్కొంది. అంతేకాదు, మొత్తం 70 శాఖలకు కూడా లేఖలు రాసింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని శాఖలు అమరావతి పరిసర ప్రాంతాలకు తరలివెళ్లాయి. గత రెండేళ్లుగా పరిపాలన మొత్తం అక్కడి నుంచే సాగుతోంది. 

Chandrababu
niti ayog
letter
address
  • Loading...

More Telugu News