Mahesh Babu: మహేశ్ బాబు 25వ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

  • వంశీ పైడిపల్లితో మహేశ్ మూవీ 
  • కీలకమైన పాత్రలో అల్లరి నరేశ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన విడుదల

ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ 'డెహ్రాడూన్'లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను, దర్శకుడు వంశీ పైడిపల్లి అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ అక్కడ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది.

ఈ సినిమాలో మహేశ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేశ్ ప్రాణ స్నేహితుడిగా 'అల్లరి' నరేశ్ కనిపించనున్నాడు. సంక్రాంతి బరిలోకి ఈ మూవీ దిగే ఛాన్స్ ఉందనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఆ పుకార్లకు తెరదించేస్తూ, ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. వేసవి సెలవుల్లో రానున్న ఈ సినిమాతో మహేశ్ కి మరో ఘన విజయం దక్కడం ఖాయమనేది అభిమానుల మాట.    

  • Loading...

More Telugu News