rains: భారీ వర్షాలకు ముంబైలో కుప్పకూలిన బ్రిడ్జ్!

  • అంధేరీ రైల్వే స్టేషన్ వద్ద కుప్పకూలిన బ్రిడ్జ్
  • ఒకరు దుర్మరణం, ఐదుగురికి తీవ్ర గాయాలు
  • రైళ్ల రాకపోకలకు ఆటంకం

భారీ వర్షాలతో ముంబై మహానగరం భీతిల్లుతోంది. వర్ష బీభత్సానికి అంధేరీ రైల్వే స్టేషన్లోని ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బ్రిడ్జి అంధేరీ ఈస్ట్-అంధేరీ వెస్ట్ లను కలుపుతుంది. ఈ ప్రమాదం నేపథ్యంలో, అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. రైలు పట్టాలపై బ్రిడ్జ్ కూలిపోవడంతో, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే స్టేషన్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు నిలిచిపోయారు. బ్రిడ్జ్ కూలిపోవడంతో రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ రూఫ్ కూడా పాక్షికంగా దెబ్బతింది. హై టెన్షన్ విద్యుత్ తీగలు కూడా డ్యామేజ్ అయ్యాయి. 

rains
mumbai
bridge
collapse
andheri
  • Loading...

More Telugu News