Russia: ఓడిపోయిన బాధను దిగమింగి... హృదయాలను గెలుచుకున్న జపాన్ ఫుట్ బాల్ అభిమానులు!

  • బెల్జియం చేతిలో 3-2 తేడాతో ఓడిన జపాన్
  • స్టేడియాన్ని స్వయంగా శుభ్రం చేసిన జపాన్ అభిమానులు
  • వైరల్ అవుతున్న ఫొటోలు

రష్యాలోని రొస్తోవ్ లో నిన్న రాత్రి అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో బెల్జియం చేతిలో 3-2 తేడాతో జపాన్ ఓడిపోగా, ఆ బాధను దిగమింగిన స్టేడియంలోని జపాన్ ఫుట్ బాల్ అభిమానులు, ప్రపంచ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

ఫస్ట్ హాఫ్ లో రెండు గోల్స్ సాధించి, మంచి ఆధిక్యాన్ని కనబరిచిన జపాన్, ఆపై అదే తరహా ఆటను ప్రదర్శించడంలో విఫలం కాగా, ఫేవరెట్టుగా బరిలోకి దిగిన బెల్జియం వరుసగా మూడు గోల్స్ సాధించి మ్యాచ్ లో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం, బెల్జియం అభిమానులు ఆనందోత్సాహాల మధ్య స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోగా, జపాన్ అభిమానులు స్టేడియాన్ని శుభ్రం చేస్తూ కనిపించారు.

స్టేడియంలో విసిరిన కాగితాలు, కూల్ డ్రింక్ బాటిల్స్ వంటి చెత్తనంతా ఏరి, బయటకు తీసుకెళ్లి పడేశారు. జపాన్ ఫుట్ బాల్ ఫ్యాన్స్, తమ కళ్లల్లో నీరు నింపుకుని, బాధను దిగమింగి బయటకు వెళుతూ కూడా, స్టేడియాన్ని శుభ్రం చేయాలన్న ఆలోచనతో వ్యవహరించడాన్ని పలువురు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

Russia
Japan
Beljium
Football
Fans
  • Error fetching data: Network response was not ok

More Telugu News