Hyderabad: స్పా పేరిట క్రాస్ మసాజ్... హైదరాబాద్ లో ఎనిమిది మంది అరెస్ట్!

  • సోమాజిగూడలో హిల్స్ బ్యూటీ స్పా అండ్ మసాజ్ సెంటర్
  • వ్యభిచారం ఆరోపణలతో గత రాత్రి తనిఖీలు
  • పట్టుబడిన ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు విటులు

స్పా పేరిట క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్న టీమ్ ను హైదరాబాద్ పోలీసులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఎదురుగా హిల్స్ బ్యూటీ స్పా అండ్ మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు.

ఇక్కడ మగవారికి ఆడవారితో మసాజ్ చేయిస్తున్నారని, వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందడంతో సోమవారం రాత్రి పశ్చిమ మండలం టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు. ముగ్గురు నిర్వాహకులు, ఇద్దరు యువతులు, ముగ్గురు విటులు పట్టుబడ్డారు. వీరందరినీ అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం పంజాగుట్ట పీఎస్ లో అప్పగించారు. విటులను, నిర్వాహకులను కోర్టుకు తరలించనున్నామని, పట్టుబడిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్ కు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు.

Hyderabad
Somajiguda
Hills Beauty Spa
Police
Arrest
Cross Massage
  • Loading...

More Telugu News