Kathi Mahesh: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: పోలీసులతో కత్తి మహేష్

  • ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదు
  • భారత న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది
  • పోలీసుల విచారణలో కత్తి మహేష్

తాను శ్రీరాముడి గురించి ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలనూ చేయలేదని, ఓ చర్చా కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని సినీ విమర్శకుడు కత్తి మహేష్ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.

నిన్న రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారించగా, తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని, భారత న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపినట్టు సమాచారం. గతంలోనూ తాను ఎన్నడూ ఏ దేవుడినీ కించపరచలేదని ఈ సందర్భంగా కత్తి పోలీసులతో అన్నట్టు తెలుస్తోంది. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. 

Kathi Mahesh
Police
Hyderabad
Lord Ram
Arrest
  • Loading...

More Telugu News