Brazil: ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బ్రెజిల్
- ఫిఫా ప్రపంచకప్‌లో మొత్తం 228 గోల్స్ సాధించిన బ్రెజిల్
- జర్మనీ రికార్డు బద్దలు
- ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచకప్ గెలుచుకున్న బ్రెజిల్
ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో బ్రెజిల్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం రాత్రి బ్రెజిల్-జర్మనీ మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించిన బ్రెజిల్ ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. మొత్తం 228 గోల్స్ సాధించిన బ్రెజిల్.. 226 గోల్స్‌తో ఉన్న జర్మనీ రికార్డును బద్దలుగొట్టింది. మొత్తం 108 ప్రపంచకప్ మ్యాచులు ఆడిన బ్రెజిల్ 228 గోల్స్‌తో ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 79 మంది బ్రెజిల్ ఆటగాళ్లు గోల్స్ సాధించారు.
బ్రెజిల్ ఆడిన 108 మ్యాచుల్లో 73 మ్యాచుల్లో విజయం సాధించింది. 17 మ్యాచులు ఓడింది. 18 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఫిఫా ప్రపంచకప్‌ను ఐదు సార్లు గెలుచుకున్న ఒకే ఒక జట్టు గానూ బ్రెజిల్ రికార్డు సృష్టించింది. కాగా, ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ సాధించిన మూడో జట్టుగా ఇటలీ నిలిచింది. 83 మ్యాచులు ఆడిన ఇటలీ 128 గోల్స్‌తో తృతీయ స్థానంలో ఉంది.