Kobbarimatta: బేసిక్ గా మీరు మంచోరు.. అంటున్న సంపూర్ణేష్ బాబు!

  • 2016లో షూటింగ్ ప్రారంభమైన 'కొబ్బరిమట్ట'
  • ఎట్టకేలకు విడుదలకు రెడీ
  • ప్రమోషన్ వర్క్ ప్రారంభించిన సంపూ

2016లో షూటింగ్ ప్రారంభమై, వివిధ కారణాలతో వాయిదా పడుతూ, దాదాపు రెండేళ్లు ఆలస్యమైన సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం 'కొబ్బరిమట్ట' విడుదలకు సిద్ధమైంది. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన సంపూ, పలు ట్వీట్లు చేశాడు.

"ప్రతి బ్యాచిలర్ కొంపలో మందు సిట్టింగ్ కి బెస్ట్ స్టఫ్ 'కొబ్బరిమట్ట' అవబోతోంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాని చూసి నవ్వుకోబోతున్నారు. మాకు మీ ప్రేమ, మద్దతు కావాలి. షేర్లు, లైకులు చేస్తారు. ఎందుకంటే, బేసిక్ గా మీరు మంచోరు" అని వ్యాఖ్యానించాడు.

మరో ట్వీట్ లో "ఎట్టకేలకు మేము సిద్ధమయ్యాం. సంవత్సరంన్నర కష్టం. కష్టం అనేది చిన్న మాట. నా రక్తాన్ని ధారపోశాను. ఎలాంటి క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తే జనం దగ్గరకి ఈ సినిమాను తీసుకెళ్తాను... అనేది ఇప్పుడు బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన" అని అన్నాడు. ఈ సినిమా ముగ్గురు భార్యలున్న ఒక మనసున్న భర్త కథని చెప్పాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News